పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలో బుధవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందాడు. తొండూరు మండలానికి చెందిన రవిప్రసాద్ అనే వ్యక్తి పులివెందుల పట్టణానికి పనుల నిమిత్తం వచ్చి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా గాంధీ సర్కిల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవి ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వ సర్వజ న ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..
కొండాపురం: మండల పరిధిలోని గండ్లూరు పునరావాస కాలనీ సమీపంలోని జాతీయ రహదారిలో పోలు కులాయిరెడ్డి(76) అనే వృద్ధుడు వెళుతుండగా కారు ఢీ కొన్న ఘటన చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందినట్లు ఎస్‌ఐ జయరాములు తెలిపారు. చౌటిపల్లె గ్రామానికి చెందిన పోలు కులాయి రెడ్డి తోట వద్దకు వెళుతుండగా కారు ఢీ కొంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
టెన్త్ ఫెయిలయ్యాడని
విద్యార్థి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం: టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఉప్పలూరు కుమార్ (16) అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. జోక్‌పాళెం వీధికి చెందిన కుమార్ ఇటీవల వెలువడిన టెన్త్ ఫలితాల్లో తెలుగు సబ్జెక్టులో తప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లోని మేడపై చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు చూసేలోపే మృతి చెందాడు. మృతుడి తండ్రి సలీంబాష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్సాహంగా జిల్లా స్థాయి వెయిట్ లిప్టింగ్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో శాప్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెయిట్‌లిప్టింగ్ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. డీఎస్‌డీవో గౌస్ బాష ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ విభాగంలో బాల బాలికలకు ఎంపికలను నిర్వహించారు.
జిల్లా స్థాయి జట్టుకు ఎంపికై ంది వీరే....
బాలికలు: శ్రీ చందన 44 కేజీలు
బాలురు: ఆదిత్య కృష్ణ– 56 కేజీలు, అనంత్ కృష్ణ–56 కేజీలు, అబ్దుల్ రెహమాన్ –65 కేజీలు, నాగమోహిత్ –71 కేజీలు, వరుణ్ –79 కేజీలు, నవదీప్ –79 కేజీలు, ఐవి కిరణ్‌కుమార్‌రెడ్డి –88 కేజీలు, తేజరామ్ –88 కేజీలు, యశ్వంత్ –56 కేజీలు (స్టాండ్‌బై)
జూనియర్ విభాగంలో...
మాబు ఆర్షద్ –65 కేజీలు, భాను తేజ –79 కేజీలు, సుదర్శన్ 88 కేజీలు


