కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

మత్తు పదార్థాలతో ఆరోగ్యం నాశనం

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కడప అర్బన్‌: వైఎస్సార్‌ కడప ఉమ్మడి జిల్లా కోర్టులలో రెగ్యులర్‌, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బుధవారం ప్రకటనలో స్పష్టం చేశారు. నిరుద్యోగులు అపోహలు నమ్మి మోసపోవద్దని, ఎలాంటి అధికారిక నోటిఫికేషన్‌ అయినా పత్రికాముఖంగానే విడుదల చేస్తామని ఆమె పేర్కొన్నారు.

ఉపాధి కార్మికురాలికి

పాము కాటు

చెన్నూరు (వల్లూరు) : చెన్నూరు మండలంలోని రామనపల్లె గ్రామంలో, పంట నీటి కాలువలో ఉపాధి పనుల ద్వారా పూడిక తీత పనులు చేస్తుండగా దస్తగిరమ్మ అనే కార్మికురాలు పాముకాటుకు గురైంది. వెంటనే అక్కడ ఉన్న తోటి కార్మికులు ఆమెను చెన్నూరు సామాజిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారని ఏపీవో శైలజ తెలిపారు. అనంతరం ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచనల మేరకు 108 వాహనంలో కడప రిమ్స్‌ ఆస్పత్రికి పంపించారు.

గాలివానకు

నేలకొరిగిన బొప్పాయి

కలకడ : మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం, గాలివానకు బొప్పాయి పంట సాగుచేసిన రైతులు నష్టపోయారు. రాత్రి సమయంలో వీచిన ఈదురు గాలులకు పంటపక్వానికి వచ్చిన చెట్లు, పంట నేలకు ఒరిగిపోవడంతో తెల్లవారి పంటవద్దకు వెళ్ళిన రైతులు లబోదిబో మంటూ కన్నీరు పెట్టుకున్నారు. మండలంలోని ఎర్రకోటపల్లె పంచాయతీ కోనప్పగారిపల్లెకు చెందిన వేణుగోపాల్‌తో పాటు పలువురు రైతులు బొప్పాయి పంటను నష్టపోయామని.. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: మత్తు పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యాలను పూర్తిగా నాశనం చేస్తాయని 30 ఆంధ్రా బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కల్నల్‌ సూర్యనారాయణ మూర్తి అన్నారు. కడప తెలుగు గంగ కాలనీలో జరుగుతున్న ఎన్‌సీసీ క్యాంప్‌లో శ్రీమత్తు పదార్థాల వినియోగం – దుష్పరిణామాలుశ్రీ అనే అంశంపై అవగాహన సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు అలవాటు మెదడు పనితీరును దెబ్బతీసి ప్రాణాంతక వ్యసనంగా మారుతుందన్నారు. కడప నార్కోటిక్‌ ఇన్‌చార్జ్‌, ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవిందరెడ్డి మాట్లాడుతూ, టీనేజ్‌, యువత ఈ వ్యసనాల బారినపడే ప్రమాదం ఎక్కువ ఉన్నందున క్యాడెట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement