ఒంటిమిట్ట : ఒంటిమిట్ట చెరువులో సోమవారం సాయంత్రం బయటపడ్డ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం ఉదయం పోలీసులు వెలికి తీయించారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఒంటిమిట్ట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినా చీకటి పడటంతో ఆ రోజు మృతదేహాన్ని వెలికి తీయలేకపోయారు. మంగళవారం ఉదయం గజ ఈత గాళ్ల సాయంతో చెరువులోని మృతదేహాన్ని సాదక్ వలీ దర్గా వైపు ఉన్న ఒడ్డుకు చేర్చారు. మృతుడు ఒక బిచ్చగాడిగా గుర్తించారు. నాలుగు రోజుల కిందట 1 మాధవరంలోని రోడ్డు నెంబర్ 23లో మతిస్థిమితం లేక ఒంటిపై దుస్తులు లేకుండా తిరగడం చూసిన స్థానిక ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న పాత టీ షర్టు, లోయర్ ఇచ్చాడు. కేసు నమోదు చేసి, యాచకుడు చెరువులో ఎలా పడ్డాడో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


