సుండుపల్లె : మండల పరిధిలోని తానా మిట్ట ప్రదేశంలో అక్రమంగా తరలిస్తున్న 6 ఎర్రచందనం దుంగలను, కారును మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీ శాఖ రేంజ్ అధికారి వై.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్లితే.. పుదిచ్చేరి ప్రాంతానికి చెందిన జ్యోతి రామన్ అనే వ్యక్తి కేఎ 01 ఎఫ్ 9555 నంబర్ గల హోండా కారులో 92 కేజీల బరువు ఉన్న 6 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా.. సానిపాయి అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని జ్యోతిరామన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వాటి విలువ దాదాపు రూ.3 లక్షలు ఉంటుందని రేంజ్ అధికారి తెలిపారు.


