రాజంపేటలో డీఆర్‌ఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

రాజంపేటలో డీఆర్‌ఎం పర్యటన

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

రాజంపేట : రాజంపేట రైల్వేస్టేషన్‌లో గుంతకల్‌ రైల్వే డివిజనల్‌ మేనేజరు చంద్రశేఖర్‌గుప్తా మంగళవారం కలియతిరిగారు. 103 గేటు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సబ్‌వేను ఆయన పరిశీలించారు. అమృత్‌భారత్‌లో రెండవ దశలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించారు. అనంతరం అధికారుల వసతి గృహాన్ని డీఆర్‌ఎం ప్రారంభించారు. ఆయన వెంట సీనియర్‌ డీసీఎం మనోహర్‌, డీవోఎం పూర్ణచంద్రరావు, కడప సీసీ జనార్ధన్‌, రాజంపేట ఎస్‌ఎంఆర్‌ పసుపులేటి గోపినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌ఎం దృష్టికి రైల్వే సమస్యలు

డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా దృష్టికి రాజంపేట, రైల్వేకోడూరు రైల్వే పరిధిలో ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలను గుంతకల్‌ రైల్వే డివిజనల్‌ యూజర్స్‌ కమిటీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ రాయలసీమ జోన్‌ బూత్‌ కమిటీ కన్వీనరు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి తీసుకెళ్లారు. వాటిని డీఆర్‌ఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా పుల్లంపేట మండల కన్వీనరు ముస్తాక్‌, నేతలు అహ్మద్‌, అమీర్‌, రజాక్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement