కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి మంగళవారం రెండు సెషన్స్‌లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 87.56 శాతం మంది విద్యార్థుల హాజరయ్యారు. కడప, ప్రొద్దుటూ రు, రాజంపేటతో కలిసి 9 కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలకు 1093 మంది అభ్యర్థులకుగాను 136 మంది గైర్హాజరయ్యారు.
కడప రూరల్ : మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి లోకేష్ ఈనెల 21న కడపలో పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 22న జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమా ల్లో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యే మాధవి, ఆ పార్టీ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్షల్లో మంగళవారం జిల్లా వ్యాప్తంగా 19 మంది విద్యార్థులు డిబార్ అయినట్లు వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్‌వీ కృష్ణారావు తెలిపారు. వైఎస్సార్ ఉమ్మడి జిల్లాలో విశ్వవిద్యాలయ స్క్వాడ్ సభ్యులు పరీక్ష కేంద్రాలను విస్తృతంగా తనిఖీ చేశారని చెప్పారు పరీక్షల్లో ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని వివరించారు.
చౌడేపల్లె: అకాల వర్షం రైతులను నష్టాల్లో ముంచెత్తింది. కొన్ని ప్రాంతాల్లో వరికుప్పలు తడిచిపోగా మరికొన్న ప్రాంతాల్లో వరి గడ్డి పై వర్షపునీటి నిల్వ కారణంగా గడ్డి దెబ్బతింది. ఇక టమాటా పంటలో నిలిచిన వర్షపునీటిని బయటకు పంపడానికి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కాగా రెండురోజులుగా కురిసిన వర్షాలకు ఎండ వేడిమినుంచి ప్రజలకు కాస్త ఉమశమనం లభించింది.


