కేకును కట్‌ చేసినట్లు చేశారు.. న్యాయపోరాటం చేస్తా | - | Sakshi
Sakshi News home page

కేకును కట్‌ చేసినట్లు చేశారు.. న్యాయపోరాటం చేస్తా

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

కేకును కట్‌ చేసినట్లు చేశారు.. న్యాయపోరాటం చేస్తా

‘పునర్విభజన పేరుతో వార్డులను కేక్‌ కట్‌ చేసినట్లు ఇష్టం వచ్చినట్లు కట్‌ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయడమే ప్రాథమికంగా తప్పు. ఈ జనాభా లెక్కల ప్రకారం 2019లోనే ఇదివరకే ఒకసారి విభజన చేశారు. మళ్లీ చేయాలంటే కొత్త జనాభా లెక్కల ప్రకారమే చేయాలి. అయినా ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. కేవలం టీడీపీ నాయకులకు రాజకీయ పునరావాసం కల్పించడానికి, రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్‌ ప్రక్రియను వారికి అనుకూలంగా మార్చుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారు. ఈ ప్రక్రియలో అధికారులు ఎలాంటి నిబంధనలు పాటించలేదు. దీనిపై తాము ఎక్కడికక్కడ అభ్యంతరాలు లేవనెత్తుతాం.. అవసరమైతే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం.

– పాకా సురేష్‌ కుమార్‌, మాజీ మేయర్‌.

Advertisement
 
Advertisement
Advertisement