జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలలో జరిగిన 16వ జాతీయ స్థాయి ఓపెన్‌ తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటినట్లు జిల్లా తైక్వాండో కార్యదర్శి నాయబ్‌ రసూల్‌ తెలిపారు. ఈ పోటీలకు అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, జిల్లా నుంచి 16 మంది క్రీడాకారులు పాల్గొని 11 పతకాలు సాధించడం జరిగిందన్నారు. బంగారు పతకాలను ధనుంజయ్‌, తారక్‌, నాగూర్‌, రజిత పతకాలను ఖాసిం, కాంస్య పతకాలను సై ఫన్నీసా, నందిని, ప్రణత, జఫరుల్లా, ఇమ్రాన్‌, మహేష్‌, రంగనాథ్‌ సాధించారని పేర్కొన్నారు. వారిని జిల్లా తైక్వాండో ప్రెసిడెంట్‌ ఈ శివశంకర్‌రెడ్డి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement