లాసెట్‌లో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

లాసెట్‌లో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంకు

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

మదనపల్లె సిటీ : ఏపీ లాసెట్‌–2026 నిర్వహించిన ప్రవేశపరీక్షలో మదనపల్లెకు చెందిన షేక్‌ అల్మాస్‌ రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. 5 సంవత్సరాల బీఎల్‌/ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరేందుకు మే 4వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో షేక్‌ అల్మాస్‌ వందకు 96 మార్కులు సాధించారు. ఆమె తల్లిదండ్రులు షేక్‌ సికిందర్‌, షేక్‌ గౌసియా. తండ్రి స్థానిక ఏవీ నాయుడు కాలనీ వద్ద వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తున్నారు. షేక్‌ అల్మాస్‌ స్థానిక కదిరిరోడ్డులోని మదనపల్లె జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ కోర్సు చదివింది. ఇంటర్‌లో 903 మార్కులు వచ్చాయి. చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణిస్తోంది. అన్న ఇర్షాద్‌ అలీఖాన్‌ న్యాయవాది కావడంతో.. తాను లాసెట్‌ రాసినట్లు తెలిపింది. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ కావడమే తన ధ్యేయమని పేర్కొంది. అల్మాస్‌ను పలువురు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement