కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయ సాగు విస్తరణకు సిబ్బంది కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. శనివారం కడపలోని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రాజంపేట డివిజన్‌లోని రాజంపేట, సుండుపల్లి, నందలూరు, వీరబల్లి మండలాలకు సంబంధించిన క్యాడర్స్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో రైతులతో ఎటువంటి మోడల్స్ ఏర్పాటు చేసుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో 365 రోజులు భూమిని కప్పి ఉండేలా పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


