ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

కడప అర్బన్‌ : ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 136 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే ఎస్పీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. అప్పటికప్పుడే సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌ కరీంతోపాటు పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement