కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్‌లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం కెఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 39.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని అర్జున్ టెండూల్కర్ 69, ప్రశాంత్ 52 పరుగు లు చేశారు. చిత్తూరు జట్టులోని నవీన్ 3, సాయి చరణ్ 2, బ్రహ్మ సాయి తేజ్‌రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 210 విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 42.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని తేజరెడ్డి 86, భవాని ప్రసాద్ 25 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 3, హానీష్ వీరారెడ్డి 4, అర్జున్ టెండూల్కర్ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 47.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని సాయి గణేష్ 51, మనోజ్‌రాజ్ 43 పరుగులు చేశారు. కడప జట్టులోని ప్రణవ్ రెడ్డి 4, మహ్మద్ ఆయూబ్ 2, నాగ కుళ్లాయప్ప 2, సుదర్శన్ 2 వికెట్లు తీశారు. అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన కడప జట్టు 48.2 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని ఆదిల్ హుస్సేన్ 43, మహ్మద్ ఆయూబ్ 73 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాబ్‌జాన్ భాష 4 విక్యాత్ 4 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రణవ్ రెడ్డి,
4 వికెట్లు
అర్జున్ టెండూల్కర్,69 పరుగులు
మహ్మద్ ఆయూబ్,
73 పరుగులు


