కడప ఎడ్యుకేషన్: విశ్వకవి వేమన, తొలి స్వాతంత్య్ర పోరాట వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దానకర్ణుడుగా పేరుపొందిన బుడ్డా వెంగళరెడ్డి ఈ ముగ్గురు మహనీయులపై ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో, వైయస్సార్ జిల్లా రచయితల సంఘం పర్యవేక్షణలో పద్య కావ్య రచన పోటీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి తెలిపారు.ఇందుకు సంబంధించి గురువారం కడప రెడ్డి సేవా సమితి సభా భవనంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు కవులు పోటీలో పాల్గొన వచ్చని తెలిపారు. వివరాలకు 7700003399 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి కోశాధికారి గుడ్ల ఆదినారాయణ రెడ్డి, మద్దిక సుబ్బిరెడ్డి,కొండా చెంచిరెడ్డి, శ్రీయపు రెడ్డి శివ నారాయణ రెడ్డి, కారపు రెడ్డి చంద్రారెడ్డి, కర్నాటి విశ్వనాథరెడ్డి, వెల్లాల వెంకటేశ్వరరాచారి, మాచిరాజు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


