ప్రతి ఒక్కరు ఏసుచూపిన మార్గాన్ని అనుసరించి, క్షమా గుణాన్ని అలవరుచుకొని సమాజానికి సహోదర ప్రేమను పంచాల్సిన అవసరం ఎంతైనావుంది. ఇతరుల కష్టాలను పంచుకోవడంలోనే శాంతి దాగివుంది అనే పరమ సత్యాన్ని చాటడానికి క్రీస్తు శిలువ ఎక్కి రక్షకుడయ్యాడు. ఏసుక్రీస్తు పరిశుద్దుడు, ఏ పాపము చేయని వాడు కనుకే తనకు తానే శిలువకు అప్పగించుకున్నాడు. మనుషుల పట్ల అవాజ్యమైన ప్రేమ, త్యాగము క్రీస్తు జీవితంలోనే చూడగలము. – కస్తూరి ఫోనిక,
సిస్టర్, నిజస్వరూపుని మందిరం, రాజంపేట


