నేడు ఒంటిమిట్టకు ఎంపీ మిథున్‌రెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ఒంటిమిట్టకు ఎంపీ మిథున్‌రెడ్డి రాక

Mar 28 2026 7:40 AM | Updated on Mar 28 2026 7:40 AM

నేడు ఒంటిమిట్టకు ఎంపీ మిథున్‌రెడ్డి రాక నెట్‌, సెట్‌ పరీక్షకు ఉచిత శిక్షణ తరగతులు మైలవరం జలాశయానికి కృష్ణాజలాలు శిల్పారామంలో చేతివృత్తుల వారికి ప్రత్యేక స్టాల్స్‌

రాజంపేట: ఏకశిలానగిరి (ఒంటిమిట్ట)లో జరుగుతున్న శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు శనివారం రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రానున్నట్లు రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆలయంలోని సీతారామలక్ష్మణలను ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌డ్డితో కలిసి దర్శించుకుంటారన్నారు. ఉదయం 10.30 గంటలకు ఒంటిమిట్టకు చేరుకోనున్నారు. వీరి వెంట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు పాల్గొంటారు.

కడప ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్‌) పరీక్షకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ అన్నారు. ఉపకులపతి స్వయంగా యూజీసీ నెట్‌/ఏపీ సెట్‌ ఉచిత శిక్షణా తరగతులు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు (రెగ్యులర్‌ తరగతులకు ఇబ్బంది కలుగకుండా) నిర్వహిస్తున్నారు. ఈనెల 28 , 29 తేదీలలో సెట్‌ పరీక్ష ఉన్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం శ్రీరామనవమి పండుగ అయినప్పటికీ శుక్రవారం బోధన చేశారు. పరీక్షల్లో రాదగిన అంశాలు, ఎలా ఆన్సర్‌ చేయాలో వివరించారు. పేపర్‌–1 లో అధిక మార్కులు స్టోర్‌ చేస్తే సెట్‌లో అర్హత సాధించడం సులువుతుందని విద్యార్థులకు తెలిపారు.

కొండాపురం: గండికోటజలాశయం నుంచి కృష్ణాజలాలను మైలవరం జలాశయానికి 2500 క్యూ సెక్కులు విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఈఈ ఉమమహేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గండికోట ప్రాజెక్టు నుంచి ఒక గేట్‌ ఎత్తి మైలవరం జలాశయం పరిధిలో తాగునీటి ఆవసరాలకోసం నీటిని పంపిస్తున్నట్లు వివరించారు. మైలవరం ప్రాజెక్టుకు 2 టీఎంసీలు పంపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 24.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.

కడప సెవెన్‌రోడ్స్‌: కడప నగర శివార్లలోని శిల్పారామంలో శిల్పారామం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వి.స్వామి నాయుడు ఆదేశాల ప్రకారం చేతి వృత్తులకు సంబంధించి ప్రత్యేక స్టాల్స్‌లను కేటాయించనున్నట్లు ఇన్‌చార్జి అధికారి వెంకట సుబ్బయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తులతోపాటు కొండపల్లి బొమ్మలు,కుమ్మర్లకు స్టాల్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.చిన్నపిల్ల లు, పెద్దవారికి సంబంధించిన వినోదాత్మకమైన గేమ్స్‌ నిర్వహణకు సంబంధించి ఆసక్తి కలవారికి ఈఓఐ పద్ధతి ద్వారా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. సంబందిత వర్గాలు ఏప్రిల్‌ 6వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు కడప శిల్పారామం ఆఫీస్‌లో సంప్రదించాలని సూచించారు.

సౌమ్యనాఽథున్ని దర్శించుకున్న గుంతకల్‌ డీఆర్‌ఎం

నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని గుంతకల్‌ డివిజనల్‌ మేనేజర్‌ (డీఆర్‌ఎం)చంద్రశేఖర్‌ గుప్తా దంపతులు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. అర్చకులు సునీల్‌, సాయికృష్ణ డీఆర్‌ఎం దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను వారికి వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి పూలమాల, శాలువాతో సత్కరించారు. అనంతరం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయనకు రైల్వే కన్సల్టేటివ్‌ మెంబర్‌ రాచూరి మురళి డీఆర్‌ఎంకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్‌ డీఓఎం శ్రావణ్‌కుమార్‌, సీనియర్‌ డీఈఎన్‌ సుదర్శన్‌రెడ్డి, డీఆర్‌యు సీసీ మెంబర్‌ తళ్లెం భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement