ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్‌లో పిల్లలతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించిన భువనేశ్వరి, ముగ్గురు పిల్లలు కడప రిమ్స్‌లో కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం రాత్రి భువనేశ్వరి తన ముగ్గురు పిల్లలు సుష్మ, నిఖిత, ఘణలకు పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాపించి ఆపై ఆమె కూడా తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. వీరిలో భువనేశ్వరి, సుష్మల ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇద్దరూ అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. అయితే మధ్యాహ్నం తర్వాత వీళ్లిద్దరి ఆరోగ్యం కాస్త మెరుగు పడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నలుగురి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
భువనేశ్వరిపై హత్యాయత్నం కేసు నమోదు
భువనేశ్వరిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలకు వారి అనుమతి లేకుండా పురుగుల మందుకలిపిన కూల్‌డ్రింక్ తాపించి చంపడానికిప్రయత్నించిందనే కారణంతో ఆమైపె హత్యా యత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం జియాలజి శాఖకు చెందిన ఆచార్యులు ఎన్. జయరాజుకు అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆహ్వానం పంపింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్స్ వారు నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో ఆచార్య జయరాజు ‘కృత్రిమ మేథస్సు అను వర్తనాలు’(ఏఐ ఇన్ ఓపెన్ సైన్స్) అనే అంశంపై ప్రసంగించనున్నారు.జయరాజుకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ అభినందనలు తెలిపారు.


