ఒంటిమిట్ట:ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో కొలువైన శ్రీరామచంద్రున్ని శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఎం.బాలాజి, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) చంద్రశేఖర్ గుప్తా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, దర్శించుకున్నారు.వీరికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, సత్కరించారు.


