హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

హుండీ ఆదాయం లెక్కింపు

Mar 25 2026 7:15 AM | Updated on Mar 25 2026 7:15 AM

హుండీ ఆదాయం లెక్కింపు అంతరాయం లేని విద్యుత్‌ను సరఫరా చేయాలి

చింతకొమ్మదిన్నె: మండలంలోని కొత్తపేట గంగమ్మ ఆలయ హుండీల సొమ్మును మంగళవారం లెక్కించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ కడప అధికారి సురేష్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మూడే కృష్ణ నాయక్‌, ఆలయ చైర్మన్‌ సోమల మాధవరెడ్డి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో హుండీలను తెరిచి సొమ్ము లెక్కించారు. ఈ హుండీ ద్వారా మొత్తం రూ.7,67,481 నగదు లభించిందని ఆలయ కార్యనిర్వహణాధి మూడే కృష్ణ నాయక్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవకులు, భక్తులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

అట్లూరు: ఎండలు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అంతరాయం లేని విద్యుత్‌ను సరఫరా చేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎస్‌.రమణ తెలిపారు. మంగళవారం కరెంటోళ్ల జన బాట కార్యక్రమంలో భాగంగా అట్లూరు, బద్వేలు మండలం చింతపుత్తయ్యపల్లి గ్రామాలను ఎస్‌ఈ సందర్శించారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. అట్లూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యుత్‌ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు విద్యుత్‌ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా సూచనలు, ప్రమాదాల నివారణ చర్యలను వివరించారు. లైన్లు, ట్రాన్సఫార్మర్లు, కనెక్షన్లు, లోడ్‌ పరిస్థితులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి విద్యుత్‌ అంతరాయాలు లేకుండా ముందస్తు మరమ్మతులు చేపట్టాలని సిబ్బందికి ఎస్‌ఈ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ కుల్లాయప్ప, ఏఈలు షర్మి ల, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement