దేశానికే మోడల్‌గా స్మార్ట్‌ కిచెన్‌ వ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

దేశానికే మోడల్‌గా స్మార్ట్‌ కిచెన్‌ వ్యవస్థ

Mar 25 2026 7:15 AM | Updated on Mar 25 2026 7:15 AM

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలో వినూత్నంగా చేపట్టిన సెంట్రలైజ్డ్‌ స్మార్ట్‌ కిచెన్‌ విధానం రాష్ట్రానికే కాక దేశంలోనే ఒక ఉత్తమ నమూనాగా నిలుస్తోందని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. న్యూఢిల్లీ ప్రగతి విహార్‌లోని స్కోప్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో ఈ నెల 23,24వ తేదీలలో నిర్వహించిన సమ్మిట్‌ లో వైఎస్సార్‌ కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న స్మార్ట్‌ కిచెన్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. స్మార్ట్‌ కిచెన్ల నిర్వహణలో విద్యార్థులకు పోషక విలువలతో కూడిన రుచికరమైన భోజనం అందడమే కాకుండా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించగలుగుతున్నామన్నారు. వారికి శిక్షణ ఇచ్చి కిచెన్‌ కార్యకలాపాల్లో భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందన్నారు. ఈ స్మార్ట్‌ కిచెన్‌ వ్యవస్థ అమలును పర్యవేక్షించేందుకు ఆధునిక డిజిటల్‌ వ్యవస్థలు అమలు చేస్తున్నామని, ట్రాకింగ్‌ ద్వారా వాహనాల కదలికలు, కిచెన్‌ కార్యకలాపాలు మానిటరింగ్‌ చేయడం వల్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచ గలుగుతున్నామని కలెక్టర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement