ఖాజీపేట: ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని సోషల్ వెల్ఫ్‌ర్ డీడీ సరస్వతి అన్నారు. ఖాజీపేటలోని ఇంటిగ్రేడ్ హాస్టల్‌ను ఆమె తనిఖీ చేశారు. హాస్టల్ గదులతో పాటు మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్న హాస్టల్ వార్డన్ పనితీరు సక్రమంగా లేని కారణంగా సస్పెండ్ చేశామన్నారు. ఇన్‌చార్జ్ వార్డన్‌తో పనిచేయిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా మెను ప్రకారం భోజనం అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేంది లేదని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


