కడప రూరల్: క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. అంతర్జాతీయ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రవిబాబు, జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ ఆశ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


