కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ సీనియర్స్ మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్‌లు హోరాహారీగా సాగాయి. ఆదివారం కర్నూలు జట్టుపై కడప జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతపురం–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టు 174 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో కడప–కర్నూలు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 41.4 ఓవర్లకు 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి సూర్యతేజ్‌రెడ్డి 72, మనోజ్‌రాజ్ 47 పరుగులు చేశారు. కడప జట్టులోని శేషాద్రి నాయుడు అద్భుతంగా బౌలింగ్ చేసి 4, చెన్నారెడ్డి 2, సుదర్శన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కడప జట్టు 24.3 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధృవకుమార్‌రెడ్డి 84, షేక్ జహీర్ అబ్బాస్ 76 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని షేక్ ఇస్మాయిల్ 2 వికెట్లు తీశాడు. దీంతో కడప జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఽవినయ్ కుమార్ 81, హానీష్ వీరారెడ్డి 59 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ఆశిష్‌రెడ్డి 3, గిరీష్‌కుమార్‌రెడ్డి 2, శ్రీకాంత్ 2, సూర్య చరణ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు 27 ఓవర్లకు 130 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆశిష్‌రెడ్డి 19, సాజిద్ సయ్యద్ 46 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున అద్భుతంగా బౌలింగ్ చేసి 5, వినయ్ కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 174 పరుగులతో ఘన విజయం సాధించింది.


