బాలికల విద్యకు భరోసా కేజీబీవీలు | - | Sakshi
Sakshi News home page

బాలికల విద్యకు భరోసా కేజీబీవీలు

Mar 23 2026 8:32 AM | Updated on Mar 23 2026 8:32 AM

బాలికల విద్యకు భరోసా కేజీబీవీలు

కడప ఎడ్యుకేషన్‌: బాలికల విద్యకు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు(కేజీబీవీ) భరోసాగా నిలుస్తున్నాయని ఇందులో చేరడానికి విద్యార్థులు పేర్లను నమోదు చేసుకోవాలని కడప జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. కడపలోని యానాది కాలనీలో ఆదివారం ఉపాధ్యాయులు, కేజీబీవీ సిబ్బందితో గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ దార్ల రూత్‌ ఆరోగ్య మేరీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ కేజీబీవీల ప్రాధాన్యత గురించి వివరించారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయన్నారు. వాటిలో 2026–2027 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతున్నామని తెలిపారు. బడి బయటి పిల్లలు ,అనాథలు, వెనుకబడిన తరగతుల పిల్లలకు 100% అడ్మిషన్స్‌ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు ఆల్‌లైన్‌లో దరఖస్తు చేసుకోవచ్చన్నారు.ఆరోతరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రతి తరగతికి 40 సీట్లు ఉంటాయని చెప్పారు. బాలికలకు ఉచిత విద్య, హాస్టల్‌ వసతి ఉంటుందన్నారు.

సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement