వరికోత వాహనం,బైక్ ఢీ : ఇద్దరు దుర్మరణం
జమ్మలమడుగు రూరల్ : ముద్దనూరు రహదారిలో వరికోత వాహనం, బైక్‌ను ఢీ కొన్న సంఘటనలో మాబుహుసేన్ (36) ఖాదర్ బాషా (29) అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జమ్మలమడుగు మండలంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకొంది. పట్టణ సీఐ నరేష్ బాబు కథనం మేరకు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండలపరిధిలోని పెద్దండ్లూరు గ్రామానికి చెందిన మాబుహుసేన్ ప్రొద్దుటూర్ నియోజకవర్గంలోని చౌడూరు గ్రామానికి చెందిన ఖాదర్ బాషాలు బంధువులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వరికోత వాహనానికి డ్రైవర్లుగా వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి పల్సర్ బైక్‌లో స్వగ్రామాలకు వస్తుండగా జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల (పాటి) గ్రామం సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న వరికోసం వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మాబుహుసేన్‌కు భార్య షాహీనా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఖాదర్ బాషాకు భార్య ముబారక్, ఒక కుమారుడు ఉన్నారు.ఇద్దరి మృతిలో గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వరికోత వాహనం,బైక్ ఢీ : ఇద్దరు దుర్మరణం


