వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

వేర్వ

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు

మదనపల్లె రూరల్‌ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువు మండలం బురకాయలకోట పంచాయతీ దేవరపల్లెకు చెందిన రాజన్న (65) వ్యక్తిగత పనులపై స్కూటీలో పక్క గ్రామానికి వెళుతుండగా, బురకాయలకోట సమీపంలోని బైపాస్‌రోడ్డు వద్ద మరో ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొంది. ప్రమా దంలో రాజన్నకు కాలు, చేయి విరగ్గా, తలకు గా యాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడి ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతి రుయాకు తరలించారు. అదేవిధంగా మదనపల్లె పట్టణం ఎగువకురవంకకు చెందిన రామకృష్ణ కుమారుడు కిషోర్‌(24) పాల ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం అదే ప్రాంతానికి చెందిన రవితేజ(24)తో కలిసి ములకలచెరువుకు బైక్‌పై వెళ్లారు. తిరిగి మదనపల్లెకు వస్తుండగా, బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె వద్ద కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరు గైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు1
1/2

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు2
2/2

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement