అఖిలపక్ష నేతలపై కేసు నమోదు
కడప అర్బన్ : కడప నగరం ఎరముక్కపల్లెలోని భాస్కర్, భారవి ఇంటిని కూల్చిన సంఘటనపై అఖిలపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహణకు సంబంధించి అనుమతి లేదని దీంతో 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తోపాటు వెంకట శివ .నాగేంద్ర. గౌస్ పీర్. సుబ్బరాయుడు, చంద్రశేఖర్, జయ చంద్ర,కొండ సుబ్బయ్య. సంగటి మనోహర్ .భారవి .భాస్కర్ లతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆస్తి కోసం తల్లిని
చితకబాదిన తనయుడు
కమలాపురం : మండల పరిధిలోని టి.చదిపిరాళ్లకు చెందిన గంగాధర్ తన తల్లి రామక్కను ఆస్తి ఇవ్వలేదని చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. చదిపిరాళ్ల ఎస్టీ కాలనీకి చెందిన రామక్క కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు గంగాధర్ ఆస్తి అంతా తనకే ఇవ్వాలని ఆదివారం పట్టుబట్టాడు. ఇద్దరు కొడుకులున్నారు కదా.. ఇద్దరికి చెరి సగం తీసుకోండని తల్లి చెప్పింది. దీంతో తాగుడుకు బానిసైన గంగాధర్ నా వద్దనే ఉంటూ ఎక్కడో కడపలో ఉన్న పెద్ద కొడుకుకు సైతం ఆస్తి ఇవ్వాలని చెబుతావా అని కొట్టాడు. కంటికి, చేతికి, తొడల వద్ద తీవ్ర గాయాలయ్యాయి. తనకు న్యాయం చేయాలని రామక్క పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
గుర్తు తెలియని
మహిళ శవం లభ్యం
కొండాపురం : మండల పరిధిలోని పాత కొండాపురంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు కొండాపురం ఎస్‌ఐ జయరాములు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు పాత కొండాపురానికి చెందిన రైతు రఘు తన తోటలోని నీటిసంపులో శవం తేలుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చాడు. ఎస్ సంఘటనా స్థలానికి ఎస్‌ఐ చేరుకొని పరిశీలించారు.మృతురాలి వయస్సు 38 నుంచి 40 సంవత్సరాలలోపు ఉంటుందన్నారు. పింక్ రంగు రవిక, తెలుపుపింక్‌రంగు గల చీర, పింక్ కలర్ చెప్పులు ధరించిందన్నారు. కుడిచేతిపైన పచ్చబొట్టు ఉందన్నారు.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
కడప అర్బన్ : కడపలోని బీకేఎం స్ట్రీట్ లో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రెండు హో ల్ సేల్ దుకాణాలలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. జిఎస్టీ పెరుగుతుందని భావించిన కొందరు వ్యాపారులు అక్రమంగా పాన్ మసాలాలు, గుట్కా నిల్వ చేసినట్లు సమాచారం వచ్చింది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారి దగ్గర అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 లక్షల మేరకు గుట్కా, పాన్ మసాలాల నిల్వలను సీజ్ చేశారు. అలాగే ఆదివారం రాధాకృష ట్రేడర్స్‌పై దాడి చేసి 14 లక్షల విలువైన పాన్ మసాలా, గుట్కా నిలువలను సీజ్ చేశారు. దాడుల్లో వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ గీతావాణి, అధికారులు మోసెస్, ఇన్‌స్పెక్టర్ శివన్న పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
కడప అర్బన్ : స్నేహితుల మధ్య డబ్బులు విషయమై మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో తన స్నేహితుడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. కడప– రాయచోటి ఆర్‌ఓబి బ్రిడ్జి వద్ద హత్య గురించి చర్చిస్తుండగా, ఇద్దరిని అరెస్టు చేసినట్లు కడప తాలూకా సీఐ టి. రెడ్డప్ప తెలిపారు. సీఐ కథనం మేరకు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి గ్రామానికి చెందిన మోటుపల్లి సతీష్ చంద్ర ప్రస్తుతం అక్కాయపల్లెలోని విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నికి చెందిన జితేందర్ ప్రస్తుతం చెమ్ముమియా పేటలో నివాసముంటున్నారు. కాగా సతీష్ చంద్ర చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన మోహన్‌లాల్ నాయక్ మధ్య 12,000 డబ్బులు విషయమై మనస్పర్థలు ఏర్పడ్డాయి. మోహన్‌లాల్ నాయక్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతో సతీష్‌చంద్ర ఆదివారం ఆయుధాలను సమకూర్చుకొని తమ వద్ద పెట్టుకున్నారు. సతీష్ చంద్ర, తన స్నేహితుడు జితేంద్ర తో హత్య గురించి సంఘటన స్థలంలో చర్చిస్తుండగా సిబ్బంది అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్దనుంచి కిలో 150 గ్రాముల గంజాయి, 23,550 నగదు, రెండు కత్తులు, బైకు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలియజేశారు.
ఆలయంలో చోరీ
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని కోనంపేట గ్రా మంలో ఉన్న చౌడేశ్వరీ దేవాలయంలో శుక్రవా రం రాత్రి గుర్తు తెలియని దొంగలు హుండీని పగులకొట్టి అందులోని నగదును దోచుకె ళ్లిన ట్లు స్థానికులు తెలిపారు. హుండీలో సుమారు రూ.50 వేలు నగదు, వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. స్థానికుల నుంచి సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.


