పట్టాలు తప్పిన ప్రత్యేకరైలు ప్రయాణం!
ఎప్పుడు రద్దుచేస్తారో..ఎప్పుడు వెళతాయో..
● కొరవడిన ప్రచారం
● అవసరమైన చోట హాల్టింగ్‌లేని వైనం
రాజంపేట: కడప, తిరుపతి జిల్లాల అనుసంధాన రైలుమార్గంలో నడిచే ప్రత్యేక రైళ్లు ఖాళీగానే పరుగులు తీస్తున్నాయి.ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేకరైళ్లను రైల్వేశాఖ నడిపిస్తుంది. అయితే ప్రత్యేక రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు అవహగన కొరవడిందనే వాదన బలంగా ఉంది. ప్రయాణికులు ప్రతి రోజు నడిచే రైళ్లపై ఆధారపడుతుంటారు. ఈ రైళ్లలో స్థలం లేక గంటలతరబడి నిలుచుని తమ గమ్యాలకు అతికష్టంగా చేరుకుంటున్నారు. ఇందుకు ప్రధానంగా ప్రత్యేకరైళ్లపై విస్తృత ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణమని ప్రయాణికులు చెపుతున్నారు. జిల్లా మార్గంలో నడిచే ప్రత్యేకరైళ్లను పదిశాతానికి మించి ప్రయాణికులు వినియోగించడంలేదు. ఫలితంగా ఈ రైళ్లు ఖాళీగా వెళుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రైల్వేశాఖ పునరాలోచించాలి.
● జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఇందులో చర్లపల్లె–తిరుపతి(07031), కాచిగూడా–తిరుచానూరు (07017), హిసార్ జంక్షన్–తిరుపతి(07718), చెర్లపల్లె నుంచి తిరుపతి (07001), చెర్లపల్లె–తిరుపతి (07140) నడుస్తున్నాయి. వీటిని ఈనెల 31 వరకు పొడిగించారు.
అవసరంలేని చోట హాల్టింగ్స్
ప్రత్యేక రైళ్లకు అవసరం ఉన్న చోట హాల్టింగ్స్‌ను ఇవ్వకపోవడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కడప, ఎర్రగుంట్ల, తిరుపతి,రాజంపేట కొన్ని రైళ్లకు హాల్టింగ్ ఇచ్చారు. జిల్లా రైలుమార్గంలో మరికొన్ని రైళ్లలో హాల్టింగ్స్ ఇవ్వడం వల్ల రైళ్లను ప్రయాణీకులకను ఆశ్రయించే వీలుంది. కొన్ని రైళ్లకు కడప రైల్వేకి హాల్టింగ్‌ను పరిమితం చేశారు. ప్రత్యేక రైళ్లను వీక్‌ఎండ్‌లో న డిపిస్తే కొంతమేర ఎర్నింగ్స్ పెరిగేందుకు దోహదపడుతుందని రైల్వేవర్గాలు భావిస్తున్నాయి.
0 నంబరుతో నడిచే రైళ్లు ఏరోజు, ఎప్పుడు వెళతాయో అన్నది కూడా చాలామంది ప్రయాణికులకు తెలియపోవడంతో వాటిని ఆశ్రయించడంలేదు. అంతేగాకుండా ఈ రైళ్లను ఎప్పుడు కొనసాగిస్తారో.. ఎప్పుడు రద్దు చేస్తారో తెలియని పరిస్థితి. ప్రత్యేకరైళ్లలో ప్రయాణం పట్టాలు తప్పుతోంది.


