విద్యార్థులకు ప్రశ్నించే తత్వం నేర్పించాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థులలో ప్రశ్నించే తత్వం నేర్పించేలా జన విజ్ఞాన వేదిక నిర్వహించే ‘వక్త’కార్యక్రమం ఉండాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకాంక్షించారు. జన విజ్ఞాన వేదిక శ్రీవక్త్ఙపేరుతో నిర్వహించే పోస్టర్‌ను ఉపకులపతి తన ఛాంబర్ లో గురువారం జేవీవీ ప్రతినిధులతోకలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలు సమాజ ప్రగతికి అవరోధాలన్నారు. భావిభారత పౌరులను ఏ విధంగా శాసీ్త్రయ దృక్పథం వైపు మళ్లించడానికి అవకాశం ఉంటుందో మేధావి వర్గం ఆలోచించాలని, జేవీవీ లాంటి సంస్థలు ఈ బాధ్యతను తీసుకొని కృషి చేస్తుండడం శుభ పరిణామం అన్నారు. జేవీవీ జిల్లా నాయకులు నాగార్జున రెడ్డి ,హైదర్ వల్లి, రాంబాబు పాల్గొని జేవీవీ దక్పథాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కే శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రాష్ట్రమంతా ‘వక్త’పోటీలు
సమాజంలో మంచి పౌరులను తయారు చేయడం, కుల ,మత ప్రాంతీయ, భాష ,ఆర్థిక,వర్ణ ,పేదరికం తొలగించడానికి, వాటి పట్ల అవగాహన కల్పించడానికి బాగా మాట్లాడగలిగిన ఉపన్యాసకుల అవసరం ఎంతైనా ఉందని జనవిజ్ఞానవేదిక (జేవీవీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. విశ్వనాథ, రాష్ట్ర నాయకులు డా.రామగోపాల్ అన్నారు. అందుకోసమే ‘వక్త’ఉపన్యాస పోటీలను రాష్ట్రమంతా నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపన్యాస పోటీలను మూడు విభాగాల్లో పాఠశాల, కళాశాల పరిధిలో జూనియర్స్, సీనియర్స్ అని విభజించి నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల పొందిన వారికి వరుసగా 5 వేలు, 3 వేలు 2 వేల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్లు చెప్పారు.జేవీవీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ పాఠశాల కళాశాల స్థాయిలో ప్రథమ ,ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి ప్రశంసాపత్రాలు, మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి ప్రశంసాపత్రాలు మెమెంటోలు, బహుమతిగా ఇవ్వనున్నట్లు చెప్పారు.సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఇది అద్భుతమైన కార్యక్రమని, దీనిని విజయవంతం చేయడానికి అన్ని ప్రజాసంఘాలు కృషి చేయాలన్నారు. డాక్టర్ వెంకటరామిరెడ్డి, జేవీవీ సలహా మండలి సభ్యుడు కె.సురేష్ బాబు, జేవీవీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ మాట్లాడారు. జేవీవీ నాయకులు మల్లికార్జున, రాంబాబు, పట్టణశాఖ అధ్య క్షుడు ఎల్లేశ్వరరావు, పట్టణ శాఖ కార్యదర్శి వెంకటరమణ, రామలింగరాజు, మహబూబ్‌బాషా, విద్యార్థి నాయకులు తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పోస్టర్స్, జేవీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేశారు.


