కూచ్‌బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ మంగళవారం కడప వేదికగా వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. తొలిరోజు ఆంధ్రా–ఉత్తరాఖండ్ రాష్ట్రాల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్లు నిర్ణీత 69.5 ఓవర్లకు 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆదిత్య నాధని 57 పరుగులు, లక్ష్యనాధని 47 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని సిద్దు కార్తీక్ రెడ్డి 3 వికెట్లు, ఏఎన్‌వి లోహిత్ 3 వికెట్లు, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 18 పరుగులు, హానీష్ వీరారెడ్డి 17 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. మ్యాచ్ మధ్యలో స్టేడియంలో వెలుతురు సరిగా లేకపోవడంతో గంట పాటు మ్యాచ్ నిలిపి వేశారు.
వెలుతురు లేక గంట పాటు
మ్యాచ్ నిలిపివేత
కూచ్‌బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ ప్రారంభం


