జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్/చింతకొమ్మదిన్నె : ఉమ్మడి కడప జిల్లాలో జూనియర్స్, సీనియర్స్ బాల బాలికల ఖోఖో జట్ల జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయని ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి జె. నరేంద్ర తెలిపారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖోఖో జూనియర్, సీనియర్స్ బాల బాలికల జట్ల ఎంపికలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్స్ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19 నుంచి 21 తేదీలలో ప్రకాశం జిల్లా పంగులూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. సీనియర్స్ జిల్లా జట్టు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24 నుంచి 26 వ తేదీ వరకు కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల ఏజీఎం హరి బసవ రాజు, ఖోఖో సంఘం సభ్యులు సుధీర్, లక్ష్మి, రవి, పవన్ కుమార్, కృష్ణయ్య,లక్ష్మణ్, రెడ్డయ్య పాల్గొన్నారు.


