మ్యూటేషన్ నిర్వహించాలి
మా గ్రామ పొలం ఎల్‌పీఎం నంబరు 2042లో ముప్‌పై ఆరున్నర సెంట్ల భూమిని 2015లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారు. కానీ రీ సర్వే నిర్వహించిన తర్వాత అధికారుల తప్పిదం వల్ల సదరు ఎల్‌పీఎం నంబరులో ఇతరుల పేర్లు నమోదయ్యాయి. కనుక మళ్లీ మ్యూటేషన్ నిర్వహించి కొత్త 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు జారీ చేయాలి. – పి.రాఘవేంద్రకుమార్‌రెడ్డి,
మల్లేపల్లె, బి.మఠం మండలం
ఖాతా నంబరు 54, సర్వే నంబరు 923/2బిలో 40 సెంట్ల భూమి మా అనుభవంలో ఉంది. అయితే సదరు భూమి ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఆ భూమిని ఆన్‌లైన్ చేయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే కలెక్టర్‌కు చెప్పుకుంటే సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో వచ్చాను.
– వెన్నపూస వెంకటరెడ్డి,
పాత గిరిగెలపల్లె, పెండ్లిమర్రి మండలం
చిన్నచౌకు గ్రామ పొలం సర్వే నంబరు 908–1ఏలో మా అబ్బ పేరిట 70 సెంట్ల భూమి ఉంది. ఆ భూమికి రెవెన్యూ అధికారులు 2015 నవంబరు 30న నా పేరిట 1బీని జారీ చేశారు. అయితే ఈ మధ్య ఆన్‌లైన్‌లో సదరు భూమికి సంబంధించిన 1బీ రిజిష్టర్ కనిపించడం లేదు. కొందరు తప్పుడు పత్రాలు తయారు చేసి విక్రయిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక దీనిపై విచారణ నిర్వహించి నా పేరిట 1బీ డాక్యుమెంటును ఆన్‌లైన్‌లో నమోదుకు చర్యలు తీసుకోవాలి. – సానపురెడ్డి కొండారెడ్డి,
హౌసింగ్‌బోర్డు కాలనీ, కడప
మ్యూటేషన్ నిర్వహించాలి
మ్యూటేషన్ నిర్వహించాలి


