ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 15న భారీ ర్యాలీ
● అదే రోజు సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి తరలింపు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపు
కడప కార్పొరేషన్ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష్యానికి మించి 4,80, 201 సంతకాలు సేకరించారని, దీన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా సంతకాలు సేకరించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సంతకాల పత్రాలను 15వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్‌టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి, పాత కలెక్టరేట్ మీదుగా తీసుకెళ్లి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. పండుగ వాతావరణంలో ఈ సంతకాలను పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, సీఈసీ మెంబర్ ఏ.మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, డా. సొహైల్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


