రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు ఎంపిక
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రామేశ్వరంలోని ఎస్‌పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి యంజర్ల ప్రణీత్‌రెడ్డి రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏపీఎస్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో జమ్మలమడుగు, కడప, రాజంపేట డివిజన్ల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు కడప సైన్స్ సెంటర్‌లో గురువారం ఎనర్జీ కన్సర్వేషన్ (ఇంధన పరిరక్షణ)పై క్విజ్ పోటీ నిర్వహించారు. ప్రణీత్ రెడ్డి 60 మార్కులకు 58 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కడప ఉపవిద్యాశాఖాధికారి రాజగోపాల్‌రెడ్డి చేతుల మీదుగా ప్రణీత్‌రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. ఈనెల 16న జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించే రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలో అతను పాల్గొననున్నాడు. ఈ విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు సత్యబాబు, ఉపాధ్యాయులు అభినందించారు.


