ప్రకృతి సేద్యం అలవాటు చేసుకోవాలి
కడప అగ్రికల్చర్ : రైతులు ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండించడం అలవాటు చేసుకోవాలని ఏపీ షీప్ అండ్ గోట్ డెవెలెమ్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్రకుమార్ అన్నారు. పంటల తెగుళ్లు, సత్తువుల కోసం ఘన, జీవామృతాలను వాడాలని సూచించారు. కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం షీప్ అండ్ గోట్ ఏడీ రమణారెడ్డి అధ్వర్యంలో పురుగు మందులపై వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుగుమందులు, ఎరువులు మోతాదుకు మించి వాడితే పశువులు, మేకలు, గొర్రెలకు ప్రమాదమేనన్నారు. పులివెందుల సూపర్‌స్పెషాలిటీ పశువైద్యశాల జేడీ డాక్టర్ శారదమ్మ, జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసులు, వ్యవసాయశాఖ ఏడీ నాగరాజు , ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ దీపక్‌కుమార్ జాశ్వల్, మంగేష్ ఆశోక్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థశాఖ, షీఫ్ అండ్ గోట్ ఏడీలు, వైద్యులు, రైతులు పాల్గొన్నారు.


