82.31 శాతం ఈకేవైసీ
జిల్లాలో ఇప్పటివరకు 82.31 శాతం ఈకేవైసీ పూర్తయింది. అక్టోబరు 7 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలో కొంతమంది జాబ్‌కార్డులను తొలగించిన విషయం వాస్తవమే. వివాహమై ఊరు విడిచి వెళ్లిన వారివి మాత్రమే తొలగించాం..అంతేగానీ మిగతా వారిని తొలగించలేదు. – ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప
ఫేస్ రీడింగ్ కారణంగా ఇబ్బందులు
ఉపాధి పనులకు సంబంధించి ఫేస్ రీడింగ్ విధానం అమలు చేస్తున్న కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా ఫేస్ రీడింగ్ కాకపోతే పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కంటి సమస్యలున్న వారికి సమస్య మరింత అధికంగా ఉంది. ఈ విషయంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – వెంకట సుబ్బయ్య, లింగారెడ్డిపల్లె, సీకే దిన్నె
జాబ్ కార్డుల తొలగింపు సరికాదు
సరైన కారణాలు లేకుండా కూలీల జాబ్‌కార్డులను తొలగిస్తున్నారు. రోజువారి కూలీ సంపాదనతో జీవించే వారికి రాజకీయాలు అంటూ తెలియవు. కొన్ని ప్రాంతాల్లో కక్షసాధింపు ధోరణి కొనసాగుతోంది. జాబ్ కార్డులు ఇలా ఏకపక్షంగా కొనసాగితే పనుల కోసం వలసలు తప్పవు. పేదల ఇబ్బందులు గుర్తించి ఉపాధి పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.
–బాబయ్య, కొలుములపల్లె, సీకే దిన్నె మండలం
82.31 శాతం ఈకేవైసీ
82.31 శాతం ఈకేవైసీ


