పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు
కమలాపురం : ఏ పార్టీకై నా కార్యకర్తలే మూల స్తంభాలని, కార్యకర్తలను విస్మరిస్తే ఏ పార్టీకై నా అథోగతి తప్పదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని టి.చదిపిరాళ్లలో జరిగిన వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ నియామక కార్యక్రమం, రచ్చబండకు ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల భాగస్వామ్యం, ఆమోదంతో గ్రామ కమిటీ, అనుబంధ కమిటీ ఛైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ కై నా కార్యకర్తలే మూల స్తంభాలని గ్రహించిన జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్ద పీట వేస్తానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారన్నారు. అందులో భాగంగానే గ్రామ కమిటీ, అనుబంధ కమిటీల నియామకాలు ప్రజల సమక్షంలోనే చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని, ఇది ప్రజలందరికి తెలుసన్నారు. ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా సమిష్టిగా పని చేసి జగనన్నను తిరిగి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే ప్రతి నెల 3వ ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటామన్నారు.
మరింత బాధ్యత పెంచింది
పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయడానికి జగనన్న చేపట్టిన నూతన కమిటీల నియామకం మరింత బాధ్యత పెంచిందని నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కమిటీ సభ్యులకే పెద్దపీట వేస్తామన్నారు. పెద్దరికం పెత్తనం కోసం కాదని, ఉత్తమ సేవకులంగా పని చేసేందుకేనన్నారు. గతంలో కూడా కమిటీలు ఉండేవని, అయితే అవన్నీ కార్యాలయాల్లో కూర్చొని కమిటీలు వేసేవారని, అయితే ప్రస్తుతం తాము నియమిస్తున్న కమిటీలు ప్రజల భాగస్వామ్యంతో వారి అభిప్రాయం మేరకు నియమిస్తున్నామని వివరించారు. రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులకు సంక్రాంతి తర్వాత ఐడీ కార్డులు ఇస్తారని, అవి విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుని చేతిలో త్రిశూలం, అర్జునుడి చేతిలో పాశు పతాస్త్రం అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని, చంద్రబాబు ఉంటే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, మునీంద్రారెడ్డి, జయసుబ్బారెడ్డి, నాగరత్నమ్మ, చిన్ని, ప్రభాకర్ రెడ్డి, రాజుపాళెం జగన్‌మోహన్ రెడ్డి, గండి భాస్కర్, మైసూరారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, జనార్ధన్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
కమలాపురంలో..
కమలాపురం మునిసిపాలిటీ పరిధిలోని 1,2,3,4,5వ వార్డు కౌన్సిల్ పరిధికి చెందిన గ్రామ కమిటీల ప్రక్రియ స్థానిక పకీర్ వీధిలోని కొలిమి సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి, మహ్మద్ సాదిక్, గఫార్ బాషా, ఇర్ఫాన్, ఆర్‌వీఎన్‌ఆర్, దేవదానం, కొండారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్ రెడ్డి


