క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని తిప్పలూరు గ్రామంలో క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్‌ఆర్ సహకారంతో పెయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని సోమవారం భారతి సిమెంట్స్ చీఫ్ మేనేజర్ పి. భార్గవర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి భయంకరమైన అంటువ్యాధి అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పుత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. ఎర్రగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాధి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. 192 మంది స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకాగా వారిలో 85 మందికి గళ్ల, రక్త పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో పెయిడ్ సంస్థ అధ్యక్షుడు కె.నాగేశ్వరరెడ్డి, భారతి సిమెంట్ సీఎస్‌ఆర్ ఇన్‌చార్జి డి.మదన్‌రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్లు ఓబులేసు, సునీల్‌తో పాటు వైద్య సిబ్బంది, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాల్లో
ఆకస్మిక తనిఖీలు
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని ఎరువుల దుకాణాలలో సోమవారం వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమలాపురం ఏడీఏ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ పాస్ యంత్రాల్లో ఉన్న నిల్వలు, భౌతికంగా అందుబాటులో ఉండే ఎరువుల నిల్వలను పోల్చిచూస్తూ లెక్కించారు. ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ కచ్చితత్వంగా ఉండాలని సూచించారు. ఎరువుల దుకాణాలలో తప్పనిసరిగా ధరల పట్టిక ఉండాలని, రైతులకు ఎరువులు పంపిణీ చేయగానే ఈ పాస్ యంత్రంలో ఆధార్ కార్డు ద్వారా నమోదు చేయాలని ఏడీఏ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ దేవి పద్మలత, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోట్లదుర్తికి వచ్చిన
రాష్ట్ర మంత్రులు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామాన్ని సోమవారం రాష్ట్ర మంత్రులు సందర్శించి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తల్లి రత్నమ్మకు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల సీఎం రమేష్ నాయుడు తల్లి రత్నమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏ.సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి జి. రవికుమార్, హోం శాఖ మంత్రి వి.అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు సీఎం రమేష్‌ను పరామర్శించారు.
చీటీల పేరుతో ఘరానా మోసం
కడప రూరల్ : ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరానికి చెందిన మునగపాటి మల్లికార్జున చీటీల పేరుతో తమను నిలువునా ముంచాడంటూ పలువురు బాధితులు వాపోయారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త మాధవరం గ్రామానికి చెందిన కోట్ల వెంకట శివ ప్రసాద్ మాట్లాడుతూ మునగపాటి మల్లికార్జున స్థానికంగా నమ్మకంగా ఉండటంతో అతని వద్ద రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చీటీలు వేశారన్నారు. తనకు చీటీల ద్వారా రూ.20 లక్షలకు పైగా డబ్బులు రావాల్సి ఉందన్నారు. తనలాగే చాలామందికి డబ్బులు రావాలన్నారు. ఈ తరుణంలో నవంబర్ 25వ తేదీ నుంచి మల్లికార్జున కనిపించకుండా పోయాడని తెలిపారు. దాదాపు 200 మంది మోసపోయారని అన్నారు. చీటీ డబ్బులుతోపాటు పలువురి వద్ద వడ్డీకి తీసుకున్న మొత్తం దాదాపు రూ.6–7 కోట్లు ఎగ్గొట్టాడని ఆరోపించారు. దీంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో బాధితులు రమణమ్మ, అవ్వారు విజయలక్ష్మి, వెంకటసుబ్బయ్య, గోపవరం సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి


