అండర్–14 జోనల్ మ్యాచ్ విజేత రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జ
● డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు
● చెలరేగిన బౌలర్లు,
చతికిలపడ్డ బ్యాట్స్‌మన్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్–నార్త్‌జోన్ విన్నర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 30 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నార్త్‌జోన్ విన్నర్స్ జట్టు 64.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు లోని కేవీ శ్రీరామ్ 35 పరుగులు చేశాడు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్‌జోన్ జట్టులోని లోకేష్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. యూనైస్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 41 ఓవర్లకు 7 వికెట్లు కోల్సోయి 113 పరుగులు చేసింది. ఆ జట్టులోని కుషల్ 33 పరుగులు, ఏవీ చరణ్ 32 పరుగులు చేశారు. నార్త్‌జోన్ విన్నర్స్ జట్టులోని రుత్విక్ చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 179 పరుగులు చేసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన సెంట్రల్ జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 12 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్టు 74.1 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధన్విన్ 59 పరుగులు, ప్రజ్ఞాన్ పండిత్ 47 పరుగులు చేశారు. సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టులోని సిహెచ్ జయవర్దన్ నాధ్ 5 వికెట్లు, రామ్ కిరణ్ విన్నీ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు 26 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. ఆ జట్టులోని రిషిత్ 32 పరుగులు చేశాడు. రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టులోని సాత్విక్ 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది. కాగా సెంట్రల్‌జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
అదే విధంగా కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో సౌత్‌జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 39 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టు 60 ఓవర్లకు 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి కృష్ణ చైతన్య 48 పరుగులు, తాహీర్ 45 పరుగులు చేశారు. సౌత్‌జోన్ విన్నర్స్ జట్టులోని రక్షణ్ సాయి చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. తరుణ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు 44 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆ జట్టులోని కేవీఎస్ మణిదీప్ 54 పరుగులు, రక్షణ్ సాయి 48 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టులోని రోహిత్ 2 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.
అండర్–14 జోనల్ మ్యాచ్ విజేత రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జ
అండర్–14 జోనల్ మ్యాచ్ విజేత రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జ
అండర్–14 జోనల్ మ్యాచ్ విజేత రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జ


