ప్రతిభను వెలికి తీసేందుకే కౌశల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభను వెలికి తీసేందుకే కౌశల్‌ పరీక్షలు

Dec 9 2025 9:18 AM | Updated on Dec 9 2025 9:18 AM

ప్రతిభను వెలికి తీసేందుకే కౌశల్‌ పరీక్షలు

ప్రతిభను వెలికి తీసేందుకే కౌశల్‌ పరీక్షలు

కడప ఎడ్యుకేషన్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కౌశల్‌ పరీక్షలు ఎంతో ఉపయుక్తం అని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ షేక్‌ షంషుద్దీన్‌ అన్నారు. కడప డీఈఓ కార్యాలయంలో సోమవారం కౌశల్‌ జిల్లా స్థాయి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో శాసీ్త్రయ ప్రతిభను పెంపొందించడానికి కౌశల్‌ టాలెంట్‌ పరీక్షలు దోహదపడుతున్నాయన్నారు. కౌశల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ విజయమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 980 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారని తెలిపారు. వారి నుంచి 12 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. జిల్లా స్థాయి విజేతలకు మొదటి బహుమతిగా రూ.1500, రెండో బహుమతి కింద రూ.1000 నగదుతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రాలను డీఈఓ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌశల్‌ జాయింట్‌ కోఆర్డినేటర్‌ సత్యమూర్తి, సైన్స్‌ మ్యూజియం క్యూరేటర్‌ రెహ్మాన్‌, సర్‌ సీవీ రామన్‌ సైన్సు క్లబ్‌ కడప గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ గునిశెట్టి శ్రీనివాసులు, సైన్సు టీచర్లు నిత్యానంద రెడ్డి, గంగాధర్‌, బోగా వెంకటసుబ్బయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, కిషోర్‌, స్కూల్‌ కోఆర్డినేటర్లు కృష్ణారెడ్డి, గోవర్దన్‌ రెడ్డి, చెన్నయ్య, చంద్రశేఖర్‌, రామసుబ్బమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు

విజేతలు వీరే..

క్విజ్‌ ప్రథమ బహుమతి..

1. అందె వంశిక, జెడ్పీ హైస్కూల్‌, దువ్వూరు

2. కె. మమత, జెడ్పీ గర్‌ల్స్‌’ హైస్కూల్‌, చెమ్ముమియాపేట, కడప

3. ఎల్‌. తనిష్కా, జెడ్పీ గర్‌ల్స్‌’ హైస్కూల్‌, చెమ్ముమియాపేట, కడప

క్విజ్‌ ద్వితీయ బహుమతి..

1. సింధు, జెడ్పీ హైస్కూల్‌, చిలమకూరు

2. వై. ప్రవీణ్‌ రెడ్డి మునిసిపల్‌ హైస్కూల్‌ రామేశ్వరం, ప్రొద్దుటూరు

3. ఎస్‌. తబస్సుమ్‌, జెడ్పీ హైస్కూల్‌, మిటాయిగిరి, జమ్మలమడుగు

రీల్స్‌ ప్రథమ బహుమతి..

జి. తిరుపతమ్మ, జెడ్పీ హైస్కూల్‌, కల్లూరు

రీల్స్‌ ద్వితీయ బహుమతి..

దీపిక, జెడ్పీ హైస్కూల్‌, చిలమకూరు

పోస్టర్‌ 1 ప్రథమ బహుమతి..

ఎస్‌. బిందు, గర్‌ల్స్‌హైస్కూల్‌, చెమ్ముమియాపేట కడప

పోస్టర్‌ 1 ద్వితీయబహుమతి..

ఎన్‌. రీమా, జెడ్పీ హైస్కూల్‌, కల్లూరు

పోస్టర్‌ 2 ప్రథమ బహుమతి..

పి. వెంకట తెజేశ్వర్‌, జెడ్పీ హైస్కూల్‌, కల్లూరు

పోస్టర్‌ 2 ద్వితీయబహుమతి..

షేక్‌ సహెరా బాను, జెడ్పీ గర్‌ల్స్‌ హైస్కూల్‌, పులివెందుల

రాష్ట్ర స్థాయికి ఎంపికై న ఈ విద్యార్థులు ఈ నెల 27వ తేదీ తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో జరిగే పోటీలలో పాల్గొంటారని కౌశల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ విజయ మోహన్‌రెడ్డి తెలిపారు.

డీఈఓ డాక్టర్‌.షేక్‌ షంషుద్దీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement