పోట్లదుర్తి గ్రామంలో ఎంపీలు, కేంద్ర మంత్రులు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామాన్ని ఆదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలతోపాటు కేంద్ర మంత్రులు సందర్శించి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తల్లి రత్నమ్మకు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల సీఎం రమేష్ నాయుడు తల్లి రత్నమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రులు కమలేష్ పాశ్వాన్, పర్వేష్ వర్మ, ఎంపీలు నిషికాంత్ దూబే, అనుకాంత్ దూబే, రాహుల్ కస్వాన్, భోలా సింగ్, సంజయ్ జైస్వాల్, నీరజ్ శేఖర్, మహేష్ యాదవ్, సతీష్ గౌతమ్, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే, మాజీ ఎంపీ సంజీవ్ బల్యాన్లు సీఎం రమేష్‌ను పరామర్శించారు. వీరు రత్నమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయిశ్రీ, ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎర్రగుంట్ల తహసీల్దార్ శోభన్‌బాబు, ఇతర అధికారులు ప్రొటోకాల్ మేరకు బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఎంపీ రమేష్ నాయుడు తల్లి చిత్రపటానికి నివాళులు


