నేడు వైఎస్ జార్జిరెడ్డి వర్థంతి
కడప అర్బన్ : కడప స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కడప జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డిని శనివారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. న్యాయమూర్తి వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉన్నారు.
దొంగ నోట్ల చలామణిపై పోలీసుల విచారణ
– పోలీసుల అదపులో
ఇద్దరు అనుమానితులు ?
ప్రొద్దుటూరు క్రైం : ఇరువురు వ్యక్తులు దొంగనోట్లు చలామణి చేశారన్న సంఘటనపై రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగనోట్లను చలామణి చేశారని సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒక మహిళ వద్ద తీసుకున్న డబ్బులో దొంగనోట్లు వచ్చాయని, వాటితో తమకు సంబంధం లేదని వారు పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇరువురు వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ మహిళ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడింది. ఆమె ఎక్కడుందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వారి వద్ద నుంచి పోలీసులు కూపీ లాగే పనిలో ఉన్నారు. మహిళ దొరికితే పూర్తి విషయాలు బయటపడతాయి.


