హోంమంత్రి కోరల్లేని పాము
– మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప కార్పొరేషన్ : రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కోరల్లేని పాము అని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక దళిత మహిళ హోంశాఖామంత్రిగా ఉన్నప్పటికీ అణగారిన వర్గాల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. ఆమె హోంమంత్రి అయినా అధికారాలేవీ లేవని తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రమాదపుటంచుల్లో ఉందని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
గుర్తు తెలియని యువకుడి
మృతదేహం లభ్యం
కొండాపురం : కొండాపురం గ్రామ సమీపంలోని గండికోట వెనుక జలాల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం(19 లభ్యమైనట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపురం గ్రామంలోని గండికోట జలాల్లో యువకుడి మృతదేహం ఉన్నాట్లు సమాచారం రావడంతో వెంటనే సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121100612, 9121100611 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.


