డ్రాగా ముగిసిన ఏసీఏ జోనల్‌ మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

డ్రాగా ముగిసిన ఏసీఏ జోనల్‌ మ్యాచ్‌లు

Dec 6 2025 7:45 AM | Updated on Dec 6 2025 7:45 AM

డ్రాగ

డ్రాగా ముగిసిన ఏసీఏ జోనల్‌ మ్యాచ్‌లు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండో రోజు వైఎస్‌ఆర్‌ఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌–నార్త్‌జోన్‌ విన్నర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శుక్రవారం 27 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నార్త్‌జోన్‌ విన్నర్స్‌ జట్టు 84.3 ఓవర్లకు 203 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. కేపీ శ్రీరామ్‌ 103, సాయి అర్జున్‌ 40 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ జట్టులోని రతన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్లు తీశాడు. చరణ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ 12 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. సాత్విక్‌ 14 పరుగులు చేశాడు. నార్త్‌జోన్‌ విన్నర్స్‌ జట్టులోని చాణక్య సాయి 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కాగా రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసింది. నార్త్‌జోన్‌ విన్నర్స్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యత సాధించింది.

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌–రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో రోజు 165 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌ జట్టు 77 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. రిషి 69, తాహీర్‌ 56 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టులోని యూనైస్‌ 3, నిఖిల్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌జోన్‌ జట్టు 76 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. రాజ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 143 బంతుల్లో 26 ఫోర్లతో 139 పరుగులు చేశాడు. లిఖిత్‌ 50, ఏవీ చరణ్‌ 61 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌ జట్టులోని తాహీర్‌ 4 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ డాగ్రా ముగిసింది. సెంట్రల్‌ జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌–సౌత్‌జోన్‌ విన్నర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో రోజు 88 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌత్‌జోన్‌ విన్నర్స్‌ జట్టు 22.5 ఓవర్లకు 91 పరుగులకు ఆలౌట్‌ అయింది. సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌ జట్టులోని వికేష్‌ 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌ జట్టు 58 ఓవర్లకు 210 పరుగులకు ఆలౌట్‌ అయింది. యాసిన్‌ సిద్దిఖ్‌ 76, సీహెచ్‌ జయవర్దన్‌నాథ్‌ 48 పరుగులు చేశారు. సౌత్‌జోన్‌ విన్నర్స్‌ జట్టులోని రక్షణ్‌ సాయి 3, తరుణ్‌కుమార్‌రెడ్డి 3, సంతోష్‌ 2, హాఫీజ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌత్‌జోన్‌ విన్నర్స్‌ జట్టు 28 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. రక్షణ్‌ సాయి 75, కేవీఎస్‌ మణిదీప్‌ 36 పరుగులు చేశారు. సెంట్రల్‌జోన్‌ విన్నర్స్‌ జట్టులోని రామ్‌కిరణ్‌ విన్నీ 3, సీహెచ్‌ జయవర్దన్‌ 3 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యత సాధించింది.

శ్రీరామ్‌,

(103 పరుగులు)

రాజ్‌ మోహన్‌

(139 పరుగులు)

రతన్‌ మనిష్‌

(5 వికెట్లు)

డ్రాగా ముగిసిన ఏసీఏ జోనల్‌ మ్యాచ్‌లు 1
1/2

డ్రాగా ముగిసిన ఏసీఏ జోనల్‌ మ్యాచ్‌లు

డ్రాగా ముగిసిన ఏసీఏ జోనల్‌ మ్యాచ్‌లు 2
2/2

డ్రాగా ముగిసిన ఏసీఏ జోనల్‌ మ్యాచ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement