● పథకాలపై హామీ ఏదీ!
కడప అగ్రికల్చర్: రైతన్నా.. మీ కోసం గ్రామ సభలు ప్రచార ఆర్భాటానికే తప్పా రైతులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని రైతులు మండిపడుతున్నారు. గ్రామ సభల్లో కరపత్రాల పంపిణీ తప్ప చేసిందేమీలేదని అన్నదాతలు విమర్శిస్తున్నారు. పైగా సభల నిర్వహణ, కరపత్రాల ముద్రణ వంటి వాటికి ప్రజాధనం దుర్వినియోగమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సభలకు వ్యవసాయ అధికారులతోపాటు ఆ శాఖకు సంబంధించిన అనుబంధశాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కానీ కొన్ని శాఖల అధికారులే హాజరవుతున్నారు. పైగా చాలా చోట్ల గ్రామ సభల్లో రైతులు ఎరువుల గురించి నిలదీస్తున్నారు. గురువారం ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరు గ్రామసభలో రైతులు అధికారలను ఎరువుల కోసం నిలదీశారు. ‘మాకు ఒక సీజన్‌కంతా యూరియా అందలేదని’ గట్టిగా అడిగారు. అధికారులు అందరికి ఇచ్చామని జవాబు చెప్పడంతో రైతులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు.‘ఎవరికిచ్చారు.. పలుకుబడి ఉన్నవాళ్లకు మాత్రమే ఇచ్చారు.. మా లాంటి వాళ్లకు ఇచ్చారా’ అంటూ ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు.
తొలి రోజు మినహా...
రైతన్న మీ కోసం ప్రారంభ గ్రామ సభకు ప్రజాప్రతినిధులు హాజరయ్యారే తప్ప మిగతా ఏ గ్రామ సభకు కూడా ప్రజాప్రతినిధులు హాజరుకాలేదని పలువురు రైతులు తెలిపారు. రైతులు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు రైతులకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వడం లేదు. వీటితోపాటు పలు పథకాలను గురించి కూడా రైతులు నిలదీస్తున్నారు. ప్రజలు గ్రామ సభల్లో నిలదీస్తారనే భయంతోనే ప్రజా ప్రతినిధులు హాజరు కానట్లు సమాచారం.
చంద్రబాబు సర్కారు ‘రైతన్నా మీ కోసం..’ పథకం బెడిసికొట్టింది. మాటల గారడీతో మాయ చేద్దామనుకున్న ప్రభుత్వ పెద్దలకు క్షేత్రస్థాయిలో చుక్కెదురైంది. పంట సాయంపై.. ఎరువుల కోతపై.. ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులపై.. రైతులు ఎక్కడికక్కడ
నిలదీస్తుంటే అధికారులు, పచ్చ నేతలు
నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. అసలే పంటలు
చేతికందక.. ప్రభుత్వం నుంచి చేయూతనందక ఆగ్రహంపై ఉన్న అన్నదాతలు ప్రశ్నల ఎక్కుబెట్టారు. ఫలితంగా తొలి రోజు
హాజరైన ప్రజాప్రతినిధులు.. పచ్చ నేతలు
రెండో రోజుకే జారుకున్నారు.
రైతన్నా ..మీకోసంతో ప్రయోజనం శూన్యం
సభలు, కరపత్రాలకు ప్రజాధనం దుర్వినియోగం
తొలి రోజు తప్పా మిగతా రోజుల్లో కానరాని ప్రజాప్రతినిధులు
రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. గ్రామ సభల్లో రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టుల గురించి ఎక్కడా హామీ ఇవ్వలేదు. అలాగే డిమాండ్ అధారిత పంటల గురించి మాట్లాడటంకానీ సాగు పద్ధతుల గురించి కానీ మార్కెటింగ్ గురించి ఏ ఒక్క అధికారి భరోసా ఇవ్వలేదని పలువురు రైతులు తెలిపారు. అలాగే అగ్రిటెక్‌లో భాగంగా సాగుకు టెక్నాలజీ తోడైతే రైతులకు తిరుగుండదని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఏ సభలో కూడా హామీ ఇవ్వలేదు. రైతుల పంటలకు విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి. కానీ ఇందుకు సంబంధించి వసతులు ఎక్కడా లేవు. అలాగే మద్దతు ధరల గురించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా రైతులకు సరైనా భరోసా ఇవ్వలేదు. ఇప్పటికే చాలా చోట్ల అరటికి సరైన మద్దతు లేక నిలువునా పంటలను దున్నేస్తున్నారు. ఉల్లిపంటకు కూడా మద్దతు ధర లేక వేల కోట్లలో రైతులు నష్టపోయారు. ఇక పాలడెయిరీలను నిలిపేయడంతో పాడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇలా రైతులకు ఉపయోగపడే ఏ అంశంపైనా సరైన హామీ.. ఉపయోగపడే సూచనలు చేయడం లేదుని రైతులు మండిపడుతున్నారు.
● పథకాలపై హామీ ఏదీ!


