జిల్లాను ప్రగతి పథంలో నడిపిద్దాం
డీసీసీ, డీఎల్‌ఆర్సీ బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ శ్రీధర్
కడప సెవెన్‌రోడ్స్: నూతన పరిశ్రమల స్థాపన, వ్యవసాయంలో అధునాతన సాంకేతికతను అవసరమైన పెట్టుబడుల కోసం రైతులకు రుణ సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బ్యాంకు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (ఈఇఇ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలు రకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలు అందించడంలో సెప్టెంబర్ మాసంతానికిగాను వైఎస్‌ఆర్ జిల్లా పురోగమనంలో కొనసాగుతున్నందుకు బ్యాంకర్లను అభి నందించారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పని చేస్తేనే.. ఆర్థిక వ్యవస్థ మరింత ధృడంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులు స్వయం సహాయక సంఘాల్లో ఆసక్తిని, బిజినెస్ స్కిల్స్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అందుకోసం బ్యాంకర్లు పొదుపు సంఘాల మహిళలకు రుణాలు అందించి.. ఆర్థిక చేయూతనిచ్చి.. జిల్లాను ఆకాంక్ష జిల్లా లక్ష్య సాధనలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలన్నారు. కడప సమృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలం నుంచి చురుకుగా ఉన్న స్వయం సహాయక గ్రూపులను, రైతులను గుర్తించి.. వారిని ఈ కామర్స్ బిజినెస్‌లోకి అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలన్నారు. అర్హులైన యువ పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా రుణ సదుపాయాలు కల్పించాలన్నారు. సైబ ర్ నేరాల పట్ల జిల్లాలో గ్రామీణ స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేలా బ్యాంకర్లు ప్రణాళికలు రూపొందించుకొని అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం, డీసీసీ, డీఎల్‌ఆర్సి సమావేశానికి సంబంధించిన అజెండా, వివరాలను, పలు శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రుణాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు కలెక్టర్ కి వివరించారు. రీజర్వ్ బ్యాంక్ ఎల్డిఓ (విజే –ఆర్‌ఓ) రాజేష్ కుమార్ కుంద్, యూబీఐ ఎజిఎం లక్ష్మీ తులసి, ఏపీజిబి ఎజిఎం శ్రీనివాస ప్రసాద్, కెడిసిసి సీఈఓ రాజమ్మ, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ శ్రీకిరణ్, డిఆర్డీఏ, మెప్మా పిడీలు రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సతీష్ కుమార్, అనుబంధ శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


