జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా సరస్వతి
కడప రూరల్: జిల్లా బీసీ సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి అధికారిగా సరస్వతి నియమితులయ్యారు. ఈమె జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఇక్కడ బీసీ సంక్షేమశాఖ అధికారిగా పనిచేసిన అంజలను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో ఈ స్థానంలోకి ఇన్‌ఛార్జి అధికారిగా సరస్వతి వచ్చారు.
చింతకొమ్మదిన్నె: తుఫాను, వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గురువారంబుగ్గవంక ప్రాజెక్ట్ నుంచి ఒక గేటు ద్వారా 150 క్యూసె క్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 185.2మీటర్ల వద్ద నీటి నిల్వ ఉందని తెలిపారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పంచాయతీరాజ్ విభాగం వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జిగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన ఏ. సురేష్‌రెడ్డి(పీఆర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి గురువారం వెల్ల డించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గల్ఫ్ కన్వీనర్‌గా బీహెచ్ ఇలియాస్‌ను మళ్లీ నియమిస్తూ కేంద్ర కార్యా లయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరోసారి గల్ఫ్ కన్వీనర్‌గా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ కమిటీలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా, అంకితభావంతో కృషి చేసి పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. 2015 నుంచి గల్ఫ్ కన్వీనర్‌గా పనిచేయడంలో సహకరిస్తున్న కువైట్, ఖతార్, యూఏఈ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కడప రూరల్: ఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. గురువారం స్థానిక ఆ శాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్ లో ఆర్సీహెచ్ 2.0, జెండర్ బేస్ వైలెన్స్ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని పేర్కొన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. డాక్టర్ ఉమామహేశ్వర కుమార్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వెంకట చంద్రారెడ్డి, డెమో భారతి, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వ్యాప్తి చెందుతున్న ‘స్క్రబ్ టైపస్ ఫీవర్‘ ను అరికట్టేందుకు వైద్యాధికారులు అవసరమైన ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్, సీజనల్ వ్యాధులు, ఆరోగ్య శాఖ ప్రాధాన్యత అంశాలు, వరి సేకరణ, ఎరువుల సరఫరా, తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తో పాటు జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, ప్రత్యేక అమలు కార్యక్రమాలతో పాటు.. ప్రధానంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టే చర్యలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ‘స్క్రబ్ టైపస్ ఫీవర్‘ వ్యాప్తి నియంత్రణపై రూపొందించిన గోడపత్రాలను కలెక్టర్ వైద్యాధికారులతో కలిసి ఆవిష్కరించారు.
జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా సరస్వతి
జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా సరస్వతి


