వేగవంతంగా ఎస్‌ఐఆర్–2025
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్ (ఎస్‌ఐఆర్– 2025) కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నా యని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపారు. గురువారం ఆయా అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో జిల్లా వివరాలు తెలియజేశారు. జిల్లాలోని 16,48,315 మంది ఓటర్లను మ్యాపింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 3,34,154 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశామని పేర్కొన్నారు. బీఎల్‌ఓ ఐడీ కార్డుల ప్రింటింగ్, పంపిణీకి సంబంధించి జిల్లాలో మొత్తం 1963 బీఎల్‌ఓల వివరాలను ఇప్పటికే అప్డేట్ చేశామన్నారు. ప్రొద్దుటూరు ఈఆర్‌ఓ మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను పంపించా మని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1963 పోలింగ్ స్టేషన్లు ఉండగా రేషనలైజేషన్ తర్వాత 2121 పోలింగ్ కేంద్రాల పెంపుదలకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు.
ప్రాధాన్యత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు
ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో లక్ష్యం మేరకు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి వరి ధాన్యం కొనుగోలు, మహిళలపై నేర నియంత్రణ, గంజాయి, మత్తు పదార్థాల నివారణ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జేసీ అదితి సింగ్ హాజరయ్యారు.
జేసీ అదితిసింగ్


