రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ‘డీఏవీ భారతి’ విద్యార్థి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ‘డీఏవీ భారతి’ విద్యార్థి ఎంపిక

Nov 20 2025 7:24 AM | Updated on Nov 20 2025 7:24 AM

రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ‘డీఏవీ భారతి’ విద్యార

రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ‘డీఏవీ భారతి’ విద్యార

కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన డీఏవీ భారతి విద్యా మందిర్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థి ఎంవీ నరేష్‌ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్‌ కిషోర్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18న కడప వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్‌ పోటీలలో డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో నరేష్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఈ నెల 22, 23 తేదీలలో పల్నాడు జిల్లాలోని వినుగొండ లయోలా హైస్కూల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్‌ పోటీలలో పాల్గొంటారని ప్రిన్సిపల్‌ తెలిపారు. కాగా భారతి సిమెంట్స్‌ ప్లాంట్‌ హెడ్‌ ఎం. రామమూర్తి, హెచ్‌ఆర్‌ చీఫ్‌ గోపాల్‌ రెడ్డి, ఐఆర్‌ అండ్‌ పీఆర్‌ చీఫ్‌ భార్గవ్‌ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి వీఎన్‌ఎన్‌కే శేషాద్రి తదితరులు నరేష్‌తో పాటు పీడీ రామచంద్రను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement