చిత్రావతికి నీటి విడుదల
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామ సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలవల్ల సీబీఆర్ ఎగువ భాగంలోని యోగివేమన రిజర్వాయర్ పూర్తిగా నిండి దిగువకు విడుదల చేశారు. దీంతో సీబీఆర్‌కు రోజుకు 3వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సీబీఆర్‌కు పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా ఒక గేటును ఎత్తి 200క్యూసెక్కుల నీటిని చిత్రావతి నదికి విడుదల చేశారు. చిత్రావతి నది డ్యాం దిగువ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ చిన్నయ్య సూచించారు. బీసీ ఈఈ వెంకటేశ్వరరావు, డీటీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


