
రైతుల సమస్యలను పట్టించుకోరా?
చాపాడు : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే నాథుడే లేరా అని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం చాపాడులో ఆయన మాట్లాడుతూ వరుణ దేవుడు కరుణించినప్పటికీ సబ్సిడీ బుడ్డ శనగ, వేరుశనగలతోపాటు డీఏపీ, యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. పంటల బీమా గురించి పత్రికా ప్రకటనలు తప్ప.. ఇంత వరకు ఏ రైతుకు ఏ పంటకు ఎంత మొత్తం జమ చేశారో చెప్పాలన్నారు. ఉల్లి పంట మంచి దిగుబడి వచ్చినప్పటికీ 40 రోజుల నుంచి రైతులు కన్నీటిపాలవుతున్నారన్నారు. అరటి, వరి, టమాటా తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.